ఆరోగ్యం
➢ శ్రీ వశిష్ట పరంపర గోకులాశ్రమం వెల్కటూర్ ఆధ్వర్యంలో గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ.
➢ విద్యార్ధులకు జ్ఞాపకశక్తి పెరుగుదల కోసం ప్రత్యేక తరగతుల నిర్వహణ, శుభ్రతపై అవగాహన.
➢ సాత్విక ఆహారంపై అవగాహన కల్పిస్తూ మానవులను శాఖాహారం వైపు ప్రోత్సహించడం.
➢ ఆహారమే ఆయుష్షు, ఆరోగ్యం అనే నినాదంతో అశాస్త్రీయ ఆహారంపై ప్రజలను చైతన్య పరచడం.
➢ సహజ పద్దతిలో పండించే ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ అందరికీ ఆరోగ్యంపై అవగాహన.
➢ పాఠశాలలలోని పేద విద్యార్ధులకు ఆశ్రమం ద్వారా ఉచితంగా పుస్తకాలు మరియు దుస్తుల పంపిణీ.
➢ గ్రామాలలో చదువుతున్న పేద విద్యార్ధులకు ఉన్నత చదువుల కోసం ప్రోత్సాహకాలు.
➢ రైతులకు గో ఆధారిత వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ ఉచిత శిక్షణ తరగతులు.
అన్నదానం
➢ ప్రతిరోజు సిద్ధిపేట జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద ఉచిత అన్నదాన వితరణ కార్యక్రమం.
గోమాత సేవ
➢ ఆశ్రమం ఆధ్వర్యంలో గోశాల నిర్వహణ, గో ఆధారిత ఎరువుల తయారీ.
➢ గోవుల నిర్వహణ కష్టమైన రైతుల నుండి గోవులను స్వీకరించి బాధ్యతల నిర్వహణ.