గోకులాశ్రమము మరియు సిద్ధాశ్రమము
➢ హైదరాబాదుకు సుమారు 120 కి.మీ దూరములో వెలసిన గోకులాశ్రమానికి 2017 నవంబరు 18వ తేదీన కార్తీక మాసం సందర్భంగా మేము యోగ మిత్రులందరితో కలిసి వెళ్ళటం జరిగింది.
➢ అంతకుముందు 2004 సంవత్సరంలో ఈ ఆశ్రమానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మగ్దుంపూర్ లో వెలసిన సిద్ధాశ్రమ ప్రారంభోత్సవం సందర్భంగా మేము పాల్గొనడం జరిగింది.
➢ ఈ రెండు ఆశ్రమాలకు సంబందించిన వరకు మాకు తెలిసిన విషయాలు అందరితో పంచుకోవాలి అనే ఉద్దేశ్యముతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాము.
➢ ఈ రెండు ఆశ్రమాల స్థాపనలో ప్రముఖ పాత్ర వహించిన డాక్టర్ మధుసూదనరావు మరియు వారి సతీమణి మాత సరళాదేవి గార్ల కృషి అనిర్వచనీయమైనది మరియు అభినందనీయం.
➢ ఈ రెండు ఆశ్రమాలకు సంబందించిన విషయాలను తెలుసుకుందాం.
సిద్ధాశ్రమం, మగ్దుంపూర్
మధుసూదనరావు గారు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ హైదరాబాదులో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న సమయంలో వారి సహచరులు, చంద్రయార్యులు అనే ఆధ్యాత్మిక గురువు గారికి 1992లో పరిచయం చేయడం జరిగింది. వారి శిష్యరికంలో రాజ యోగాభ్యాసం లభించింది. గురువు ప్రోద్బలంతో 1994లో హైదరాబాద్ లో స్వగృహం నిర్మించుకున్నారు. గురువుగారు 2000 సంవత్సరం వరకు వారి గృహము నుంచే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు.
అటుపిమ్మట వారి సొంత గ్రామమయిన మగ్దుంపూర్ వెళ్లిపోయారు. అక్కడే చిన్న కుటీరంలో ఉంటూ అధ్యాత్మిక ప్రచారం సాగించేవారు. అక్కడే వారు మధుసూదనరావు గారిని ఆశ్రమ నిర్వాహకుడిగా ప్రకటించి, ఆశ్రమ నిర్మాణం చేయమని ఉద్దేశించారు. ఆశ్రమ నిర్మాణానికి కావలసిన సన్నాహాలు చేస్తుండగానే 2002వ సంవత్సరంలో గురువు గారు పరమపదించారు. వారి కోరిక మేరకు 2004 నవంబర్ నెలలో బంధువుల సహకారంతో 145 గజాల స్థలంలో చిన్న ఆశ్రమ నిర్మాణం పూర్తి చేశారు.
అప్పటి నుంచి ఆశ్రమానికి సంబంధించిన యువకులు, ప్రజల సహకారంతో ఆశ్రమం నిర్వహిస్తున్నారు.
ఇట్లు : మీప్రేమపాత్రులు డాక్టర్ కత్తి మల్లయ్య